SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది భారత రాష్ట్ర సమితి పార్టీ చెప్పినట్లుగానే రైతు బంధు విషయంలో కొర్రీలు పెట్టేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఏకంగా 19 లక్షల ఎకరాలకు రైతు బంధు నిలిపి వేసేందుకు సిద్ధమవుతోంది సాగు చేసే రైతులకు రైతు బంధు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో క్షేత్రస్థాయిలో సర్వే జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు అందుతుంది ఇందులో 19 లక్షల ఎకరాలు సాగులో లేకున్నా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నాయి దీని ప్రకారం ఎకరానికి పదివేల చొప్పున ఏడాదికి 1900 కోట్లు వారి ఖాతాలలో జమవుతున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఇప్పుడు ఆ నిధులు కట్ అవుతాయి అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో అసలు రైతులకు కూడా కొంత మంది ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది.

ఒక రైతుకు మొత్తం ఐదు ఎకరాలు ఉండగా ఒక్కో ఎకరం ఒక్కో స్థలంలో ఉంటుంది అందులో కొంతమేర సాగులో ఉంటుంది కొంతమేర నీళ్లు ఇతర సరైన సదుపాయాలు లేక పంట వేయని పరిస్థితి ఉంటుంది కానీ ఓవరాల్ గా అతనికి ఐదు ఎకరాలు ఉన్నట్లే కెసిఆర్ ప్రభుత్వంలో ఆ ఐదు ఎకరాలకు రైతు బంధు యధావిధిగా ఇచ్చేవారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో అసలు సిసలైన ఈ ఐదు ఎకరాల రైతు సాగు చేసే వరకు మాత్రమే రైతుబంధు అందుకుంటాడు తన మిగతా భూమికి రైతు బంధు రాదు ఇలా చాలా మంది రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.

WhatsApp Image 2024 02 11 at 9.18.43 AM

SAKSHITHA NEWS