మెగాస్టార్ చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది *ఇక బిజెపి నుండి రాజ్యసభ సభ్యుడిగా కూడా అయ్యే అవకాశం వుందని మీడియా లో వార్తలు వస్తున్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారని చిరంజీవి కోడలు ఉపాసన తాత అపోలో హాస్పిటల్స్ ఎండి కి కాంగ్రెస్ పార్టీ తో అనుబంధం వుండడంతో అట్నుంచి మొదలుపెట్టారని. చిరంజీవి బిజెపి లో చేరితే తెలంగాణ లో బిజెపి బలపడుతుందని రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులకు అర్థమయిందని ..
అందుకే చిరంజీవి బిజెపి ద్వారా రాజ్యసభ సభ్యుడిగా వెళ్లకుండా అడ్డుకోవడానికి తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని అయితే బిజెపి నాయకత్వంతో, ప్రధానమంత్రి మోడితో పవన్ కళ్యాణ్ కు వున్న అనుబంధం అందరికి తెలిసిందే… పవన్ కళ్యాణ్ బహిరంగ సభలలో కూడ హిందూ మతం గురించి మాట్లాడుతారు… కాని చిరంజీవి కి గతంలో బిజెపి తో అనుబంధం లేదు… రాంచరణ్ మరియు చిరంజీవి బిజెపి కి మద్దతు ఇస్తే తెలంగాణ లో బిజెపికి వారి అభిమానులు, కమ్యూనిటీ వారు కూడ సహజంగానే మద్దతు ఇస్తారని సీమాంధ్ర సెటిలర్లు కూడ బిజెపి వైపు మొగ్గు చూపుతారని ఇది కాంగ్రెస్ కు నష్టం కలిగించే పరిణామంఅని. అందుకే చిరంజీవి బిజెపి లో చేరకుండా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలంగాణ లో ప్రస్తుతం టాక్.