SAKSHITHA NEWS

,హైదరాబాద్ : రానున్న ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర బడ్జెట్ సిద్దమవుతోంది. 2024-25 బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ నెల పదో తేదీన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. కొత్త వార్షిక ప్రణాళిక కసరత్తు చివరి దశలో ఉంది. బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకొని బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత ఇచ్చారు.

అందుకు అనుగుణంగా పద్దు సిద్దం రానుంది. లేని గొప్పలు వద్దని, వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని సీఎం గతంలోనే అధికారులకు స్పష్టం చేశారు. ఆ ప్రకారమే 2024 – 25 బడ్జెట్ రానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ సర్కార్ రెండు లక్షలా 90 వేల కోట్లకు పైగా బడ్జెట్ తీసుకొచ్చింది. అందులో డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం మొత్తం లక్షా 56 వేల కోట్లకు పైగా ఉంది. పన్ను ఆదాయం లక్ష కోట్ల వరకు…రెవెన్యూ రాబడులు లక్షా పాతికవేల కోట్ల రూపాయలు ఖజానాకు సమకూరాయి.

WhatsApp Image 2024 02 06 at 11.16.57 AM

SAKSHITHA NEWS