మాదాపూర్ డివిజన్ పరిధిలోని అపర్ణ కౌంటీ యొక్క ఔట్ లెట్ సమస్య పై కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ అధికారుల తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
సాక్షిత : ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అపర్ణ కౌంటీ కాలనీ యొక్క ఔట్ లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపుతామని, ఔట్ లెట్ సరిగ్గా లేకపోవడం వలన,కుంచించుకోపోవడం వలన కాలనీ లో మురుగు సమస్య తీవ్రమైనది అని, ఔట్ లెట్ ను సరాసరి కైదమ్మ కుంట చెరువు వద్ద కలవకుండా ప్రత్యేక మురుగు నీళ్ల మల్లింపు UGD పైప్ లైన్ లోకి మళ్లించాలని చెరువులో కలుషితం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని , దీనికి శాశ్వత పరిష్కారంగా ఔట్ లెట్ సమస్యను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడలని, డ్రైనేజి మ్యాన్ హోల్ ల ను మరమ్మత్తులను చేపట్టి ఇబ్బంది లేకుండా చూడలని, ఇరిగేషన్ మరియు GHMC అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఔట్ లెట్ సమస్య శాశ్వత పరిష్కారం చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ అధికారులకు తెలియచేశారు. గతంలో వర్షాలకు లోతట్టు కాలనీ లు జలమయంకు గురి అయినవి అని, కట్టను పునరుద్ధరించడం జరిగినది అని, మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, రాబోయే వర్షకాలం లోపల పనులు పూర్తి చేయాలని,కైదమ్మ కుంట చెరువును సుందరికరించి, ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని,కాలనీ లో రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు DE నళిని, AE పావని, RI శ్రీనివాస్ మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లేష్ గౌడ్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.