SAKSHITHA NEWS

ఉదయం 2 గంటల సమయంలో భూకంపం

మొత్తం 14 సార్లు కంపించిన భూమి

చైనా లో భారీ భూకంపం సంభవించటంతో అక్కడ ప్రజలు ఉలిక్కిపడ్డారు. కిర్గిస్తాన్ – జిన్జియాంగ్ సరిహద్దు ప్రాంతాల్లో 7.2 తీవ్రతతో భూమి కనిపించింది. ఈ ఘటనలో అనేకమంది గాయపడినట్లు, అనేక భవనాలు నేలమట్టమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

అయితే చైనాలో భూకంపం సంభవించడంతో ఢిల్లీలో కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. ఇలా జరగటం కొత్తేమీ కాదు అంట. జనవరి 11న ఆఫ్ఘనిస్తాన్ లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు కూడా ఆ ప్రకంపనలు ఢిల్లీని తాకాయి, అలానే నేపాల్ లో భూకంపం సంభవించినప్పుడు కూడా ఆ ప్రకంపనలు ఢిల్లీ వరకు కనిపిస్తాయి.

Whatsapp Image 2024 01 23 At 10.44.52 Am

SAKSHITHA NEWS