మైలవరం మండలంలోని కీర్తిరాయునిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని (మినిరల్ వాటర్ ప్లాంట్) మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు.
గ్రామపంచాయతీ సర్పంచి బర్రా శోభనాద్రీ నిధులతో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ 1000 లీటర్ల నీటిని శుద్ధి చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని సర్పంచి తెలిపారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ
గ్రామస్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తన స్వంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సర్పంచి బర్రా శోభనాద్రీని ప్రత్యేకంగా శాలువా కప్పి సత్కరించి అభినందించారు.
ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర గ్రామాల సర్పంచిలు కూడా ప్రజలకు విస్తృతంగా సేవలను అందించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.