
తాను చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు విశాఖ నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ ప్రకటించారు. ఇవాళ విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన వైసీపీ రెబల్ నేతలు సమావేశమయ్యారు. తనతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి బయటకు వస్తారన్నారు. కాగా, విశాఖ సౌత్ సీటు వాసుపల్లి గణేశ్కు ఇవ్వడంతో సీతంరాజు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు.
