SAKSHITHA NEWS

విద్యార్థులకు పండగల విశిష్టత సాంప్రదాయాలు సంస్కృతిల గురించి అర్థమయ్యేలా వివరించడం కోసమే ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించాం…

అక్షర ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ యు. మహేందర్

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ అయిజ మండలం పరిధిలోని
సంక్రాంతి పండుగ సంబరాలను అక్షర ఉన్నత పాఠశాలలో సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు….పాఠశాల ప్రిన్సిపాల్ యు. మహేందర్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.

విద్యార్థులు చక్కటి సాంప్రదాయ దుస్తులను ధరించి ముగ్గులు వేస్తూ పాఠశాల ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. హరిదాసుల వేషధారణతో విద్యార్థులు పాఠశాలకు రాగా సాంప్రదాయ నృత్యాలతో చిన్నారులు అలరించారు. భోగి పండుగ సందర్భంగా భోగి మంటలను వేసి ముత్యాలు చేశారు సంక్రాంతి ముందస్తు సంబరాలను చిన్నారులు జరుపుకోవడంతో పాఠశాల మొత్తం పండగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొంటూ పాలు పొంగించారు.. పాఠశాల ఆవరణలో విద్యార్థులందరూ పతంగులు ఎగరవేశారు…

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ యు.మహేందర్ మాట్లాడుతూ..

పాఠశాల ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు ముందస్తు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు…

విద్యార్థులకు పండగల విశిష్టత సాంప్రదాయాలు సంస్కృతిల గురించి అర్థమయ్యేలా వివరించడం కోసమే ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించినట్లు ప్రిన్సిపల్ యు మహేందర్ తెలిపారు. పాఠశాలలోని అన్ని తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేషధారణతోపాటు అందమైన రంగవల్లులు వేస్తూ సంబరాల్లో పాల్గొన్నట్లు తెలిపారు.

అంతక ముందు,
పాఠశాల ప్రాంగణంలో ముగ్గులు వేసే స్థలాన్ని పరిశీలించి, విద్యార్థులను అభినందించారు…

ఈ కార్యక్రమంలో హెచ్ఎం.వెంకటేష్,ప్రతాప్,మాధవి మరియు పాఠశాల బృందం తదితరులు పాల్గొన్నారు…

Whatsapp Image 2024 01 11 At 6.10.44 Pm

SAKSHITHA NEWS