SAKSHITHA NEWS

జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ…

గద్వాల నియోజకవర్గం పూ డూరు, అనంతపురం గ్రామాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ప్రజా పాలన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ హాజరై ప్రారంభించారు…

ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం కోసం తలపెట్టిన 6 గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తామన్నారు..అభయహస్తం కొలువుదీరిన 48 గంటలలోనే తెలంగాణ ఆడ్డబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీ లను అమలు చేశామని, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహాజ్యోతి,ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందని సరితమ్మ అన్నారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లత్తిపురం వెంకటరామిరెడ్డి, గోన్పాడు శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ పుడూరు ఈశ్వర్, జమ్మిచెడ్ ఆనంద్, త్రిపాల్,అచ్చన్న గౌడ్, అనంతపురం కురువ రాముడు,రాజారెడ్డి, ఇమాన్యుల్, జలీల్, రహీం, సురేష్, బ్రహ్మేశ్వర్ రెడ్డి,కృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు….

Whatsapp Image 2024 01 04 At 12.10.11 Pm

SAKSHITHA NEWS