SAKSHITHA NEWS

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.


*సాక్షిత : *సింగరేణి లో జరిగిన కార్మిక సంఘ ఎన్నికల్లో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని భారీ మెజారిటీతో ఏఐటీయూసీ ని గెలిపించి రాష్ట్ర గుర్తింపు సంఘంగా నిలబెట్టారని, ఈ విజయం కార్మికుల విజయం అని నేడు జగతగిరిగుట్ట, షాపూర్ నగర్లో ఏఐటీయూసీ అనుబంధ సంఘాలైనా భవన నిర్మాణ కార్మిక సంఘం, హమాలి సంఘం ఆధ్వర్యంలో బాణసంచాలను కాల్చి విజయోత్సవ సంబురాలు చేశారు.
ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ అధ్యక్ష,కార్యదర్శులు స్వామి,హరినాథ్, శ్రీనివాస్ లు నాయకత్వం వహించగా ఉమా మహేష్ ముఖ్యఅతిథిగా హాజరై జగతగిరిగుట్ట లో ఏఐటీయూసీ జండా ఎగురవేసి మాట్లాడటం జరిగింది. ప్రపంచంలో ని మెజారిటీ ప్రజలంతా ఏదో ఒక పనిచేసే కార్మికులే నని కానీ కొంతమంది కార్పొరేట్, భూస్వాములు రాజకీయం చేస్తూ ప్రభుత్వాలను తమ చేతుల్లో ఉంచి సంపదను,శ్రమను దోచుకుంటుంటే,కార్మికులను పేదవారిగా ఉంచే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ,కార్మికుల రాజ్యం ద్వారానే పేద ప్రజల కష్టాలు తీరుతాయని అదే నినాదంతో దేశంలో ఏర్పడిన మొట్టమొదటి సంఘం ఏఐటీయూసీ అని అన్నారు.

కార్మికుల హక్కులను కాపాడేది ఏకైక సంఘం ఏఐటీయూసీ అని కార్మికుల కోసం ఎన్నో పోరాటాలను చేసిన చరిత్ర ఉందని అన్నారు.ప్రజలు చైతన్య వంతులు అయ్యారని అందుకే ప్రజలు కమ్యూనిస్టుల వైపు చూస్తున్నారని దానికి నిదర్శనం ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ ని గెలిపించడమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాములు,సీపీఐ మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య, కె.వెంకటేష్, ఏఐటీయూసీ నాయకులు సుంకిరెడ్డి, రవి, ముసలెయ్య, యాదగిరి,నర్సింహారెడ్డి,ఆశయ్య,సోమయ్య,మల్లమ్మ,సోమక్క,తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2023 12 29 at 2.56.32 PM

SAKSHITHA NEWS