SAKSHITHA NEWS

చైర్మన్, వైస్ ఛైర్మన్ లపై అవిశ్వాసం కు కాంగ్రెస్ నోటీసు

మంచిర్యాల పురపాలక సంఘం బీఆరెస్ పార్టీకి చెందిన చైర్మన్ పెంటరాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్ లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లు కలెక్టర్ సంతోష్ కు నోటీసు అందజేశారు. 26 మంది కౌన్సిలర్ లు కలెక్టర్ కార్యాలయం కు ప్రత్యేక బస్ లో వెళ్లారు. కలెక్టర్ ను కలిసి సంతకాలతో కూడిన వినతిపత్రం ను సమర్పించారు. అవిశ్వాసం కు అవసరమైన కౌన్సిలర్ ల సంఖ్యాబలం తమకు ఉందని కాంగ్రెస్ పక్ష నాయకుడు రావుల ఉప్పలయ్యా, ఉప నాయకుడు వేములపళ్ళు సంజీవ్ కలెక్టర్ కు తెలిపారు. మెజార్టీ సభ్యులు ఉన్నందున చైర్మన్ పెంటరాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్ లపై అవిశ్వాసం కోసం సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ 15 రోజుల్లో సంతకాలు చేసిన కౌన్సిలర్ వివరాలను విచారిస్తారు. ఆతరువాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాసం తీర్మానంకు అవకాశం ఇస్తారు.


అయితే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గెలుపొందడంతో బీఆరెస్ కౌన్సిలర్ లు 17 మంది కౌన్సిలర్ లు కాంగ్రెస్ లో చేరారు. ఐదుగురిని అప్పట్లో మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు బీఆరెస్ లో చేర్చుకోగా తాజాగా ప్రేమసాగార్రావు ఏకంగా 17 మందిని కాంగ్రెసులో చేర్చుకుని దివాకర్ రావుకు అవిశ్వాసం అనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అవిశ్వాసం కు అవసరమైన సంఖ్యాబలం పెరగడంతో క్యాంపు రాజకీయాలకు అవసరం లేకుండాపోయింది. చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టనున్న ట్లు ఉప్పలయ్యా తెలిపారు.

WhatsApp Image 2023 12 15 at 3.22.00 PM

SAKSHITHA NEWS