ఫైనల్ పబ్లికేషన్ అందించేటప్పుడు తప్పులు లేని ఓటర్ జాబితా అందివ్వండి
బూత్ లెవల్ అధికారులు ఎన్నికల కమిషన్ పరిమితులు దాటి విధులు నిర్వర్తిస్తున్నారు
ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు జోక్యం ఎక్కడ ఉండకూడదు
ధర్మవరం నియోజకవర్గ ఈఆర్ఓ ను కలిసి వినతిపత్రం అందజేసిన తెదేపా నాయకులు
ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా భోగస్ఓట్లు,డబుల్ ఓట్లు, శాశ్వత నివాసం లేని వారి ఓట్లు,మరణించిన వారి ఓట్లు,పెళ్లి అయి స్థానికంగా లేనివారి ఓట్ల వివరాలను ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ జిల్లా కలెక్టర్ కి మరియు ఈఆర్ఓ కి గతంలోనే
అందజేయడం జరిగిందని వాటిపై ఇంతవరకు చర్యలు తీసుకోవడంలో అధికారులు తాత్పర్యం ప్రదర్శిస్తున్నారని కోరుతూ,ధర్మవరం తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో స్థానిక తెదేపా నాయకులు ధర్మవరం రెవిన్యూ డివిజన్ ఆఫీసులో గల ఎలక్ట్రోల్ రిజిస్టర్ ఆఫీసర్(ERO) ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో తో మాట్లాడుతూ గత మూడు నెలల క్రితం జిల్లా కలెక్టర్ కి మరియు ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి భోగస్ ఓట్లు గుర్తించడం జరిగిందని వాటిని తొలగించమని కోరుతూ, బూతుల వారిగా బోగస్ ఓట్ల జాబితా తమరికి అందజేశామని కానీ ఇంతవరకు బోగస్ ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవడం లేదని ధర్మవరం నియోజకవర్గ ఈఆర్ఓ దృష్టికి తెదేపా నాయకులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ మాట్లాడుతూ కచ్చితంగా అనర్హులైనటువంటి ఓట్లను తొలగించడం జరుగుతుందని ఎన్నికల కమిషన్ 2024 వ సంవత్సరం జనవరి 5 న పబ్లిష్ చేసేటటువంటి ఫైనల్ లిస్టులో తప్పులు లేని ఓటరు జాబితను రాజకీయ పార్టీలకు అందివ్వడం జరుగుతుందని ఈఆర్ఓ తెదేపా నాయకులకు హామీ ఇచ్చారు.