సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3052 సివిల్ అధికారులు సిబ్బంది, 16 కంపెనీ ల కేంద్ర బలగాలు, 1150 ఇతర రాష్ట్రాల సిబ్బంది తో ఎన్నికల నిర్వహణ
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాలో ఉన్న 06 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి సెక్టార్ అధికారులు, పోలీసు రూట్ మొబైల్ అధికారులు, ఆర్ముడ్ అధికారులతో పోలింగ్ అధికారులను, పోలింగ్ పరికరాలను పోలింగ్ లొకేషన్ లకు పటిష్టమైన భద్రతతో తీసుకువెళ్లడం జరుగుతుంది.
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నియోజకవర్గం ZPHS, TTS, ఏన్టీపీసీ , జ్యోతి నగర్ , రామగుండం, మంథని నియోజకవర్గం JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , మంథని , పన్నూర్, రామగిరి మండలం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను మరియు మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంచిర్యాల,బెల్లంపల్లి నియోజకవర్గం, ZPSS బజార్ ఏరియా బెల్లంపల్లి., చెన్నూర్ నియోజకవర్గం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చెన్నూర్ (ఎల్లక్క పేట్)లలోని పోలింగ్ పరికరాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) గారు సందర్శించి ఏసీపీలకు, పోలీస్ అధికారులకు, సిబ్బంది కి పోలింగ్ బందోబస్త్, భద్రత పై ఆదేశాలు, పలు సూచనలు చేయడం జరిగింది.