కొల్లాపూర్ నియోజకవర్గం విపనగండ్ల మండలం సంపత్ రావ్ పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో డాక్టర్ కురువ విజయ్ కుమార్ కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భీరం హర్షవర్ధన్ రెడ్డి తో కలిసి జోరుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సర కాలం జూపల్లి మంత్రి హోదాలో ఉండి కూడా నియోజకవర్గ ప్రజలకు ఏ మంచి పని చేయలేదని పేర్కొన్నారు.
మదాసి కురువల పట్ల కూడా వారు ఒక స్పష్టమైన వైఖరి లేకుండా ఉన్నారు వారు చూపే ప్రలోభాలకు ఎవ్వరు లొంగవద్దని ప్రజలను హెచ్చరించారు.
భీరం హర్షవర్ధన్ రెడ్డి మదాసి కురువలకు ఎంతో మేలు చేశారని ఒకసారి ఆలోచించాలని చెప్పారు.
అదే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కుట్రపూరితంగా హర్షవర్ధన్ రెడ్డి అనే పేరుగల మరో ఇద్దరు వ్యక్తులతో నామినేషన్ వేయించడం జరిగింది.ప్రజలు ఎవ్వరు మోసపోకుండా వాస్తవ విషయాన్ని తెలియజేస్తూ సీరియల్ నెంబర్ 4 కారు గుర్తుపై ఓటు వేసే విధంగా ప్రజలను ఉత్తేజితులను చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో విపనగండ్ల ఎంపీపీ,సర్పంచ్, గ్రామ పెద్దలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.