మంత్రి కేటీఆర్ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని సత్కరించిన సూపర్ మాక్స్ కార్మికులు….
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సూపర్ మాక్స్ కంపెనీ ఉద్యోగులు ఎమ్మెల్యే కేపీ వివేకానందని కలిసి మర్యాదకపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఉద్యోగులకు న్యాయం చేస్తామంటూ మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క కార్మికుడికి కూడా అన్యాయం జరగనివ్వమని ఎందుకంటే సీఎం కేసీఆర్ కార్మికపక్షపాతి అని అన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కార్మికులతో ఉండేది బిఆర్ఎస్ పార్టీయే తప్పా కుత్బుల్లాపూర్ లో అధరణ లేని బీజేపీ, కాంగ్రెస్ లు కాదన్నారు. ఎన్నికల సమయంలో పగటి వేషగాళ్లలా వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత కనిపించని ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలకు మోసపోకుండా తమ భవిష్యత్తుకు భరోసానిచ్చే బిఆర్ఎస్ పార్టీని మరోసారి ఆదరించి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయని అందించాలని కోరారు.
అనంతరం సూపర్ మాక్స్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ఏళ్ళ తరబడి పరిశ్రమలో పనిచేస్తూ బతుకుదెరువును ఏడుస్తున్న మా బ్రతుకులను కంపెనీ యాజమాన్యం చిన్నాభిన్నం చేస్తూ ఉన్న ఫలానా ఉద్యోగులను తొలగించడంతో రోడ్డున పడ్డామని మా ఆవేదనను గుర్తించి ప్రభుత్వ విప్ , ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ ని కలిసి మా గోడును వెళ్లబుచ్చామని, మా బాధలపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి గురువారం ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని సూపర్ మాక్స్ కంపెనీ ఉద్యోగులు అన్నారు.
ఈ కార్యక్రమంలో సూపర్ మ్యాక్స్ కంపెనీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.