గద్వాల పట్టణ భవిష్యత్తు తలరాతను మార్చే ఓటును వృధా చేయొద్దు
అంధకారం నుంచి అభివృద్ధి వైపుగా గద్వాల పట్టణం
బీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే నీరుపేదల జీవితాల్లో వెలుగులు
గద్వాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతను రెండవసారి గద్వాల ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి కోరుతూ…
గడప గడప ప్రచార కార్యక్రమంలో హాజరైన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ బండ్ల సాయి సాకేత్ రెడ్డి .
గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ని అత్యధిక మెజార్టీటీతో గెలిపించుకుందాం.
గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డ్ కౌన్సిలర్ దౌదర్ పల్లిలో విష్ణుప్రియా దౌలు అధర్వంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గారు బలపరిచిన,గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని గెలిపించాలని మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ ,వైస్ చైర్మన్ బాబర్ ,గద్వాల ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను మరియు రాబోయే కొత్త పథకాలను ప్రజలకు వివరిస్తూ మరొక్కసారి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ సందర్బంగా
చైర్మన్ కేశవ్ స్వామి
బండ్ల సాయి సాకేత్ రెడ్డి మాట్లాడుతూ…
కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలో మరియు ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణన్న హయాంలో గద్వాల పట్టణంలో జరిగిన అభివృద్ధిని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టిన మేనిఫెస్టో మరియు మహిళా సాధికారత గురించి ప్రజలకు స్పష్టంగా వివరిస్తూ కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు చెప్పే అమలు కానీ హామీలని నమ్మి మోసపోయి గోసపడదంట్టూ తెలంగాణకు కెసిఆర్ కేటీఆర్ గద్వాల పట్టణానికి కృష్ణ మోహన్ రెడ్డి శ్రీరామరక్ష అంటూ గద్వాల పట్టణం మరింత అభివృద్ధి జరగాలంటే కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని అందుకు ప్రతి ఒక్కరూ గద్వాల నియోజకవర్గం పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి వేయించి భారీ మెజార్టీటీతో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ని మరోసారి ఆశీర్వదించి గెలిపించగలరని ప్రతి ఒక్క ఓటర్లును కోరడం జరిగింది. పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల సంక్షేమం కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా ప్రజలు లబ్ధి పొందే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు.
నవంబర్ 30 తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ని, గద్వాల ఎమ్మెల్యే ని మరొక్కసారి మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో :- మాజీ మున్సిపల్ చైర్మన్ వేణుగోపాల్ గారు,మున్సిపల్ కౌన్సిలర్స్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ గద్వాల టౌన్ అధ్యక్షులు కార్యవర్గ టౌన్ యూత్ అధ్యక్షులు కార్యవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు యూత్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.