ఘనంగాభారతదేశ మొట్ట మొదటి ప్రధానమంత్రి స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు..
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు విస్మరించిన వైసిపి పార్టీ రాష్ట్ర ప్రభుత్వము.
పిసిసి డెలిగేట్ మెంబర్ శ్రీ పాచి పెంట చిన్న స్వామి.
అరకు నియోజకవర్గము
ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర చైర్ పర్సన్ మరియు అరకు వేల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు భారత దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 134వ జన్మదిన వేడుకలు అరకు వేల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా శ్రీ పి చిన్న స్వామి స్వాతంత్రము వచ్చిన తర్వాత భారత దేశ ఆర్థిక పరిస్థితి అభివృద్ధి అంతా అంత మాత్రమే ఉన్న సమయంలో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టి ఎక్కించి పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టి దేశ ప్రజలకు ముందడుగు వేసి అనేక పరిశ్రమలు స్థాపించిన దేశ అభివృద్ధికి కృషిచేసిన ఏకైక మహానేత అదేవిధంగా బాల బాలికలు అంటే అపారమైన ఇష్టం కనుక పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినన్ని బాలల దినోత్సవముగా ప్రతి ఏటా నిర్వహిస్తారు ఈ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వము పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన అని విస్మరించడం చాలా దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు గొల్లూరి పద్మ అరకు వేల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పి గంగాధర్ ప్రధాన కార్యదర్శి శెట్టి భగత్ రాం .కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్రమితుల పూజారి దామోదర్. కుమ్మిడిశెట్టి సుశీల. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు