ప్రతి పేదవానికి మెరుగైన ఆరోగ్య సేవలు అందాలనే లక్ష్యంతో జగనన్న వైద్య రంగంలో విప్లవాతకమైన మార్పు తీసుకువచ్చారని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. స్థానిక నెహ్రు నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ఉదయం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం లో మేయర్ పాల్గొని వైద్యానికి వచ్చిన పేషెంట్లకు హెల్త్ చెకప్ లు నిర్వహించారు.అనంతరం ఆరోగ్య సురక్ష శిబిరాలలో ప్రజలకు సురక్ష కిట్లను పంపిణీ చేశారు.
మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్య మంత్రి జగనన్న లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా అందరికీ ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఆరోగ్య సురక్ష శిబిరాలలో స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొంటున్నారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బసవ గీత, ఆరోగ్య అధికారి యువ అన్వేష్ రెడ్డి, సూపర్డెంట్ రవి, వైఎస్ఆర్సిపి నాయకులు బాలసుబ్రమణ్యం, వైద్యులు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.