SAKSHITHA NEWS

శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం
ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా గాంధీ ని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం
ఆల్విన్ కాలనీలో ప్రచారం చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరేకపూడి గాంధీ ని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ తరపునుండి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2, షిరిడి హిల్స్ నగర్, చక్రదరి నగర్ కాలనీలలో ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది.

ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కి శ్రీరామ రక్ష అని తెలియచేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిది ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు తెలిపారు. పాదయాత్ర చేస్తూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులను ప్రజలు మరిచిపోలేదని, ఎవరింటికి వెళ్లిన ఆసరా పెన్షన్, కల్యాణ లక్ష్మీ వంటి వాటి గురించే మాట్లాడుతున్నారని అన్నారు. తనతో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, మహిళలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేసారు.

మనందరం బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం సమిష్టిగా పనిచేసి గాంధీ కి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్ మరియు రాజేష్ చంద్ర, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, కృష్ణారావు, వెంకట్ నాయక్, భాస్కర్ రెడ్డి, పి.మహేష్, షౌకత్ అలీ మున్నా, ప్రదీప్ రెడ్డి, సత్యనారాయణ, యాదగిరి, రాములుగౌడ్, ముజీబ్, బాలస్వామి, ఫజల్, సీఎచ్.భాస్కర్, వాలి నాగేశ్వరరావు, సతీష్, వెంకటకృష్ణ, దేవేందర్, సాయిగౌడ్, రవీందర్, కూర్మయ్య, వెంకటేష్, బాలరాజు మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, శిరీష సత్తుర్, స్వరూపా, లావణ్య, లక్ష్మమ్మ, మంజుల, షేక్ బిబి, ఎ.స్వరూపా, పుట్టం దేవి, రేణుక, సురేఖ, ప్రీతి, స్వప్న, వరలక్ష్మి, బి.లక్ష్మీ, దేవి, వల్లి రమణ, సౌందర్య, కృష్ణవేణి, పర్వీన్, యస్మిన్, మహముదా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 01 At 3.21.47 Pm

SAKSHITHA NEWS