సాక్షిత : నరసరావుపేట పట్టణంలోని స్థానిక 22, 23, 24 వార్డు సచివాలయంలో “జగనన్న ఆరోగ్య సురక్ష” క్యాంపును ప్రారంభించిన..
-నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి..*
నరసరావుపేట పట్టణంలోని స్థానిక 22, 23, 24 వార్డులకు సంబంధించిన సచివాలయం ఆవరణంలో నేడు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని వైద్య అధికారులు మరియు వైసీపీ నాయకులతో కలిసి నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డా౹౹గోపిరెడ్డి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి తరలివచ్చిన స్థానిక వార్డు ప్రజలకు స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది అని శిబిరాల్లో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారని. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. పట్టణంలో మరియు గ్రామాలలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతముగా కొనసాగుతుందని. ఐదు దశల్లో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తుంది కావున సంబంధిత ప్రతి ఒక్కరు ఈ యొక్క బృహత్తర జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.._
ప్రతి కుటుంబాలను వైద్య బృందాలు కలిసి 7 రకాల వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. సురక్ష క్యాంపులను నిర్వహించి వారికి కావలసిన వైద్య సహాయాన్ని కూడాను అందిస్తారు. జగనన్న ఆరోగ్య సురక్షతో మరింత మెరుగైన వైద్యం అందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని స్థానికంగానే స్పెషలిస్ట్ డాక్టర్లతో పాటు కంటి వైద్య డాక్టర్ కూడా రావడం జరిగింది అదేవిధంగా ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా పంపిణీ చేయనున్నారు. ప్రజలకు కావాల్సిన వైద్యం అందించటం కోసం “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని డాక్టర్ గోపిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేషన్ చైర్మన్ లు, డైరెక్టర్లు, వార్డు ఇంచార్జ్లు, మండల కన్వీనర్, ఎంపీపీ, జడ్పిటిసి, ప్రజాప్రతినిధులు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, వైద్య శాఖ అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటరీలు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, ఏఎన్ఎంలు, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..