SAKSHITHA NEWS

సాక్షిత :*నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ బస్సును టిటిడి చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, అభినయ రెడ్డి లు గురువారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఎస్.పి.జే.ఎన్.ఎం. క్రీడా మైదానంలో ఈ బస్ ను ప్రారంభించారు. అక్కడ నుండి జ్యోతి థియేటర్ కూడలి, టౌన్ క్లబ్, ఎస్వీ యూనివర్సిటీ వరకు వెళ్లి అక్కడ నుండి టౌన్ క్లబ్ కూడలి మీదుగా అలిపిరి కూడలి, కపిలతీర్థం కూడలి వరకు వెళ్ళి శ్రీనివాస సేతు మీదుగా మామిడి కాయల మంది వరకు, అక్కడ నుండి తిరిగి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం వరకు ఈ బస్ లో టిటిడి ఛైర్మన్, మేయర్, కమిషనర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు ప్రయాణించారు. అనంతరం గంగమ్మ ను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ డబుల్ డెక్కర్ బస్ ను తిరుపతిలో ఏర్పాటు చేయడం సంతోషం అన్నారు. తిరుపతి నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నదని, కౌన్సిల్ ఆమోదంతో ఈ బస్ ను నగరపాలక సంస్థ కొనుగోలు చేశామన్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి అందాలను వీక్షించేందుకు వీలుగా ఈ డబుల్ డెక్కర్ బస్ ను ఏర్పాటు చేశామని అన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ బస్ నాలుగు మార్గాల్లో నడపనున్నామని అన్నారు. ఈ ఎలక్ట్రిక్ ఏ.సి. బస్ నిర్వహణను పరీక్షించిన తరువాత మరో నాలుగు బస్సులను అందుబాటులోనికి తెస్తామని అన్నారు. ఈ బస్ లో ప్రయానించండం కొత్త అనుభూతిని కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

0c33930d 93c5 4392 Bfe7 38489c3b237f

SAKSHITHA NEWS