నిజాంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ ..
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, నిజాంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు కూన కృష్ణ గౌడ్ – మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ రాత పుస్తకాలు, గడియారం, గొడుగులతో కూడిన కిట్లను అందజేశారు.
ఈ సందర్బంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కష్టాలు తమకు తెలుసని, అందుకే వారికి అండగా నిలిచిందుకే పుస్తకాల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తుంటే కొంతమంది అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఎవరెన్ని కుట్రలు పన్నినా, ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందిస్తామని అన్నారు. తాము 2006 నుండి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడేం కొత్త కాదని తెలిపారు. పేద విద్యార్థులకు అండగా నిలబడడమే తమ ట్రస్ట్ లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, సుమన్ రావ్, బిక్షపతి, సాయికృష్ణ రెడ్డి, కొంకి రాము, నర్సింహా రెడ్డి, రామకృష్ణ రెడ్డి, భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.