సికింద్రాబాద్ : పేద విద్యార్ధులకు బాసటగా నిలిచి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని ప్రభుత్వ స్కూల్ లలో ముఖ్యమంత్రి ఉపాహార్ పధకాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అడ్డగుట్ట ప్రభుత్వ స్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. విద్యార్ధులకు ఉపాహారాన్ని వడ్డించి తాను కుడా వారితో కలిసి ఉపాహారం తీసుకున్నారు.
కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, డిప్యూటీ కమీషనర్ సుధాంశు, ఇంజినీర్ ఆశా లతా, ప్రిన్సిపాల్ మధుసూదన్ రెడ్డి, విద్యాదికారులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ముండగా నిర్దేశించిన మేరకు ప్రతి స్కూల్ లో విద్యార్ధులకు ఒక్కో రోజు ఒక్కో మెనూ చొప్పున అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు జరిపిందని తెలిపారు. ప్రభుత్వం భారీ వ్యయ ప్రయాసలతో కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. బీ ఆర్ ఎస్ నేత లింగాని శ్రీనివాస్ తో పాటు నాయకులు పాల్గొన్నారు.