కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్ లో రూ. 1 కోటి 99 లక్షల 50 వేల రూపాయతో అంచనావ్యయం తో నిర్మించిన Interactive సైన్స్ థీమ్ పార్క్ ను ఎంపీ రంజిత్ రెడ్డి కార్పొరేటర్లు హమీద్ పటేల్ , రాగం నాగేందర్ యాదవ్ , మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పార్క్ ను అన్ని రంగాలలో సుందరికరించి,అన్ని హంగులతో ,అన్ని రకాల మౌళిక వసతులతో సుందరికరించి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిచడం జరిగినది అని, సైన్సు తో కూడిన బొమ్మల తో ఆహ్లాదకరమైన వాతావరణం కలిపించడం జరిగిఅంది అని, వాకింగ్ ట్రాక్ నిర్మాణం ద్వారా పిల్లలకు, పెద్దలకు వాకింగ్ చేసుకోవడానికి సులభంగా ఉండి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుంది అని , పార్క్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ,అన్ని రకాల వసతులు కలిపిస్తామని, పార్క్‌లలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
అదేవిధంగా పత్రిక నగర్ పచ్చని చెట్లతో విరాజిల్లాలని, హైటెక్ సిటీకి వెనక భాగంలో ఉన్న పత్రిక నగర్ కు చాలా ప్రాధాన్యత ఉందని ఆ ప్రాధాన్యతలో భాగంగా పత్రిక నగర్ లోగల పార్కుల్లో పచ్చని చెట్లు కనిపించాలని దానికి పత్రిక నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేయాలని సూచించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని కాలుష్యాన్ని రూపుమాపి ఆరోగ్యకర వాతావరణానికి చెట్లు ఎంతగానో దోహదపడతాయని, పార్కులో లో పూలు పండ్లు ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలు నాటి వాటి పరిరక్షణకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పరంగా పత్రికా నగర అభివృద్ధికి కృషి చేస్తామనీ హామీ ఇచ్చారు. పత్రిక నగర్ లో అందరూ ఐకమత్యంగా ఉంటూ రాష్ట్రంలోని ఆదర్శ కాలనీ గా అభివృద్ధి చేసేందుకు అసోసియేషన్ కృషి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో GHMC SE శంకర్ నాయక్, EE శ్రీనివాస్ AE సునీల్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ ,ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఉద్యమకారులు,బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.