పేదింటి ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం – ఎమ్మెల్యే కే పి వివేకానంద్
బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రమంతటా పేదింటి మహిళలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చీర కానుకలు అందజేస్తుందని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129 సూరారం డివిజన్ పరిధిలోని సూరారం గ్రామం లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తున్నారని, గతంలో ఏ ప్రభుత్వాలు కూడా బతుకమ్మ పండగకు చీరలు పంపిణీ చేయలేదని, బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ, దసరా పండుగ కానుకగా ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలను అందజేయడం జరుగుతందని అన్నారు. ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ చీరలు కానుకగా అందజేస్తున్నారని, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంతో నియోజకవర్గంలో పండగ వాతావరణం తలపిస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరికీ చీరలు అందేవిధంగా ఏర్పాట్లు చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షులు,
డివిజన్ అద్యేక్షులు, స్థానిక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు మరియు మహిళలు పాల్గొన్నారు.