SAKSHITHA NEWS

సేవ్ జర్నలిజం డే

అక్టోబర్ 2 న గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా “సేవ్ జర్నలిజం డే” ను పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU), ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ)
పిలుపు ఇచ్చిన మేరకు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని
పిడుగురాళ్ల ఏపీడబ్ల్యూజే అధ్వర్యంలోఐలాండ్ సెంటర్
వద్ద గల గాంధీ విగ్రహం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ
గత నాలుగున్నరేళ్ళుగా రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదు. అడ్డగోలు నిబంధనల కారణంగా అక్రెడిటేషన్ జారీ అరకొరగా జరిగిందిని,
దాదాపు పన్నెండు వేలమంది అర్హులైన జర్నలిస్టులు అక్రెడిటేషన్ పొందలేక పోయారు! హెల్త్ కార్డుల పరిస్తితి కూడా అధ్వాన్నంగా తయారైంది.
ప్రమాదబీమా పథకం పూర్తిగా అటకెక్కింది.

కరోనాతో మృతిచెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం జీఓ అమలును నిలిపి వేయడంతో పాటు, దానికి ప్రత్యామ్నాయంగా మెరుగైన సహాయం చేద్దామని అంటూ చెప్పిన ప్రభుత్వ పెద్దలహామీ కూడా అలాగే మూలన పడివుంది.
జర్నలిస్టులపై పలు జిల్లాల్లో దాడులు జరిగాయి. పైగా జర్నలిస్టులపై అక్రమకేసులు బనాయించారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు

గాంధీజీ విగ్రహానికి వినతిపత్రాల సమర్పించారు.
“సేవ్ జర్నలిజం డే” అంటూ నినాదాలు చేశారు.
AP highlights
ఇట్లు.
పిడుగురాళ్ల ఏపీడబ్ల్యూజే


SAKSHITHA NEWS