SAKSHITHA NEWS

ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి – ఎమ్మెల్యే కె పి వివేకానంద్.
డివిజన్లో దశాబ్దాలుగా నోచుకోని పనులను 9 సంవత్సరాలలో పూర్తి చేసాం..న్యూ షాపూర్ నగర్లో 75లక్షల వ్యయంతో చేపడుతున్న సి సి రోడ్ పనులకు శంకుస్థాపన..


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మిగిలి ఉన్న సమస్యలను ప్రజల నుండి తెలుసుకొని వాటి పరిష్కారమే ద్యేయంగా ప్రస్తుతం జరుగుతున్నా అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతియాత్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ 129 సూరారం డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ మరియు న్యూ షాపూర్ నగర్లో 96వ రోజు పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలు వంటి మంజీరా నీటి సరఫరా,సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ పనులు పూర్తి చేసినందుకు కాలనీల ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మంగళ హారతులతో ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం న్యూ షాపూర్ నగర్ లో రూ. 75 లక్షల వ్యయంతో చేపడుతున్ననూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్లో దశాబ్దాలుగా నోచుకోని పనులను 9 సంవత్సరాలలో పూర్తి చేశామన్నారు, ప్రజల ఇచ్చిన మాట ప్రకారం కాలనీల అభివృద్ధికి కృషి చేసినందుకు కాలనీ వాసులంతా ఎమ్మెల్యే వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. మిగిలి ఉన్న చిన్నపాటి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో.అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. వాటిని త్వరలోనే పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజా సమస్యలను శాశ్వతంగా అధిగమించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి కాలనీ, బస్తీ రూపురేఖలు మారుతున్నాయన్నారు. సంక్షేమ సంఘాలు ఇదే ఐక్యతతో ఉంటూ అభివృద్ధికి సహకారం అందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధికారులు DEE శిరీష, AE సంపత్, HMWS DGM అప్పల నాయుడు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, జనరల్ సెక్రటరీ సిద్ధికి, మధుమోహన్, సీనియర్ నాయకులు మఖ్సూద్ అలీ చౌడ శ్రీనివాస్, నాగిళ్ల శ్రీనివాస్, మన్నే బాలేష్, అమీర్ ఖాన్, మల్లారెడ్డి, ఫిరోజ్, చెక్క సురేష్, ప్రభుదాస్, అన్వార్, అఖిల్, మొయిజ్, నగేష్, రవి, సాజిద్, ముకుందం, ఉల్పి శ్యామ్, వెంకటేష్, దాస్, విషు, అనిల్, నందు, అశ్వక్ ఖాన్, ముస్తాక్, ఖాన్, ఉమర్, విజయపాల్, రాజన్న, సురేష్, మహిళా నాయకులూ అరుణ, మెహబూబీ, భాగ్య లక్ష్మి, ధన లక్ష్మి, సువర్ణ, లక్ష్మి, షబానా, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS