SAKSHITHA NEWS

చాంద్ బీ పై ఉన్న 8 లక్షల రివార్డ్ చెక్కును అందించి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

CPI (మావోయిస్ట్) పార్టీ సభ్యురాలు షేక్ ఇమాంబీ,జ్యోతక్క
వయస్సు 65 సంవత్సరాలు, మనుబోతలగడ్డ h/o బుధరావుపేట (V) స్థానికురాలు సీపీఐ(మావోయిస్ట్) పార్టీ సిద్ధాంతాలతో ప్రభావితురాలు అయి చేరి తిరిగి సాధారణ, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి తేదీ 19.03.2024, ప్రభుత్వ సరెండర్ కమ్-రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా,మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐపీఎస్ ఎదుట లొంగిపోవడం జరిగింది.

తన పై ఉన్న 8 లక్షల రివార్డ్ చెక్కును మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో చాంద్ బి కి అందించడం జరిగింది.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ…ప్రభుత్వం యొక్క సరెండర్-కమ్-పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరియు జానజీవన స్రవంతిలో చేరాలని మావోయిస్టు భావజాలంతో భ్రమపడిన CPI (మావోయిస్ట్) పార్టీకి చెందిన UG క్యాడర్‌లందరికీ బహిరంగ అభ్యర్థన చేయబడింది. సమాజం శాంతియుత జీవితాన్ని గడపడానికి అన్ని రాకములుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు

PRO to SP మహబూబాబాద్


SAKSHITHA NEWS