SAKSHITHA NEWS

Garlic price: అల్లం, వెల్లుల్లి ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర 500 రూపాయల మార్క్‌ దాటింది. అటు అల్లం కూడా కిలో 300 నుంచి 350 రూపాయలకి చేరింది..

ఇప్పుడు ఎల్లిగడ్డలు బహిరంగ మార్కెట్ లో కిలో ధర 500 రూపాయలకు పెరిగింది. దీంతో పంట పొలాల నుంచే వాటిని కొందరు దుండగులు ఎత్తుకెళ్తున్నారు. దీంతో పంటను కాపాడుకోవడం కోసం పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్‌ ప్రాంతంలోని అయిదారు గ్రామాలకు చెందిన పొలాల్లో ఎల్లిగడ్డ చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత ఈ దొంగతనాలు అదుపులోకి వచ్చాయని తెలిపారు..

అయితే, గత 60 ఏళ్లలో ఎప్పుడూ వెల్లుల్లి ధరలు ఇంతగా పెరగలేదని రైతులు చెబుతున్నారు. వెల్లుల్లిపాయలు సాగు చేసిన రైతులు ధనవంతులయ్యారు.. కానీ ఇప్పుడు తాము పండించిన పంట చోరీకి గురవుతుందనే భయంతో ఉన్నారు. కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో దాదాపు 1,500 హెక్టార్ల భూమిలో వెల్లుల్లి పంటను పండిస్తారు.. జిల్లాలో ఉద్యాన పంటల మొత్తం విస్తీర్ణం లక్షా 30 హెక్టార్లు ఉంది. 2023లో వెల్లుల్లికి మంచి ధర రాకపోవడంతో రైతులు పంట వేయడానికి ఆసక్తి చూపలేదు.. సగటు ఉత్పత్తి 28 నుంచి 32 క్వింటాళ్ల వరకు ఉంటుందని రైతులు తెలిపారు..

WhatsApp Image 2024 02 17 at 12.45.28 PM

SAKSHITHA NEWS