SAKSHITHA NEWS

27న భగత్ సింగ్ మేనల్లుడు కుత్బుల్లాపూర్ పర్యటనను విజయవంతం చెయ్యండి.
సిపిఐ జాతీయ సమితి సభ్యులు యూసఫ్.

భగత్ సింగ్ మేనల్లుడు ఈ నెల 27న కుత్బుల్లాపూర్ మండలంలో జగత్గిరిగుట్ట,గాజులరామారం లో పర్యటనకు వస్తున్నారని కావున భగత్ సింగ్ అభిమానులు పార్టీలకు అతీతంగా హాజరు కావాలని నేడు అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో జగత్గిరిగుట్టలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యతితీగా హాజరై ప్రసంగించారు.
గతంలో భగత్ సింగ్ పేరు వింటేనే యువకుల రక్తం ఊరకలు ఎక్కేదని, కాని నేడు ప్రపంచికరణ,సినిమాలో హీరో అంటే నలుగురిని తన్ని,ఒక అందమైన అమ్మాయి కోసం ఎదురుతిరిగి పెండ్లి చేసుకూనే వాడిని హీరో గా పరిచయం చేస్తూ ప్రజలకు అసలు హీరో లను పరిచయం చేస్తలేదని అందువల్ల నేడు విద్యార్థులకు,యువకులకు భగత్ సింగ్ చరిత్ర దూరం అయిందని కావున భగత్ సింగ్ చరిత్ర నేటి తరానికి , అందరికి తెలియచేసి అసలైన హీరో భగత్ సింగ్ అని చెప్పడానికి అఖిల భారత యువజన,విద్యార్ధి సమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాస రచన,వ్వక్తృత్వ,పాటల పోటీలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే నేడు భగత్ సింగ్ పుట్టిన కుటుంబంలో పుట్టి ఆయన వారసత్వాన్ని, లక్ష్యాలను ప్రజలకు తెలియచేస్తున్న వారి మేనల్లుడు ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్ మన ప్రాంతానికి వస్తున్నారని కావున అందరూ పాల్గొని జయప్రదం చెయ్యాల్సిందిగా కోరారు.

భగత్ సింగ్ బ్రిటిష్ వారికి క్షమాభిక్ష అడిగితే క్షమాభిక్ష రద్దు చేసే అవకాశం ఉన్నపటికి తన ఉద్దేశ్యం భారత దేశానికి స్వాతంత్రం కావాలి కానీ భగత్ సింగ్ ప్రాణాలు కాపాడుకోవడానికి కాదని క్షమాభిక్ష అడగకుండా ఉరి తాడును ముద్దాడుతూ ఇంక్విలాబ్ జిందాబాద్- సామ్రాజ్యవాదం నశించాలి అని నినాదాలిస్తూ మరణాన్ని దైర్యంగా ఆహ్వానించారని అలాంటి వారి చరిత్ర తెలుసుకొని ప్రజలు దేశ భక్తి స్పూర్తిని పొంది,దైర్యం తెచ్చుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఉందని అలాగే ప్రతి ఒక్క సంస్థ ఇలాంటి చరిత్రను ప్రచారం చెయ్యాలని, వాటిని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చెయ్యాలని కోరారు.
ఈ కార్యక్రమానికి అఖిల భారత యువజన సమాఖ్య కార్యదర్శి వెంకటేష్ అధ్యక్షత వహించగా యువజన నాయకులు బాబు,రాంరెడ్డి,సిపిఐ కార్యదర్శి ఉమా మహేష్,సహాయ కార్యదర్శి దుర్గయ్య,కార్యవర్గ సభ్యులు స్వామి,హరినాథ్,నర్సయ్య,రాములు,శ్రీనివాస్,సహాదేవ్ రెడ్డి,యువజన నాయకులు యాగంటి,సిపిఐ నాయకులు ఇమామ్,జానకిరామ్,నర్సింహా,సోమయ్యా తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS