సాక్షిత : రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ దండగన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కేపిహెచ్బి డివిజన్ లోని కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఫోరం మాల్ సర్కిల్లో రైతులకు మద్దతుగా నిలుస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు మాట్లాడుతూ… రైతు లేనిదే మన కడుపు నిండదని.. అలాంటి రైతు బాగుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా అనేక నీటి ప్రాజెక్టులను నిర్మించి రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు అందిస్తున్నారని.. నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే స్థాయికి వెళ్లిందని గుర్తు చేశారు.. అలాంటి పచ్చగా ఉన్న రాష్ట్రంలో రైతులకు మూడు గంటలు కరెంటు సరిపోతుందని మాట్లాడడటము.. రైతులు పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని తెలిపారు …దయచేసి ఇటువంటి వారి మాట నమ్మొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు ఎప్పుడు అండగా ఉంటారని రైతులకు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, నాయకులు సాయిబాబు చౌదరి ,రాజేష్ ,పాతూరి గోపి, జున్ను సాయి, నారాయణ రాజు, కట్టా నర్సింగరావు, వెంకట్రెడ్డి, రాంబాబు నాయుడు, వలవల నాయుడు, త్రినాథ్ ,రామయ్య, పున్నారావు, రాజా వెంకట్రావు వేణుగోపాల్ ,సాంబశివరావు, భవాని ,భారతి ,లత ,రమ కుమారి, కాంతమ్మ, బేగం, నాన్బీ ,నాగిన ,మల్లిక, హేమ, పద్మా రెడ్డి ,సుకన్య ,సంగీత సుబ్బలక్ష్మి, రాజేశ్వరి, కుమారి భాస్కర్ నాయి, రాము హరిబాబు, రామ్ దాల్ నాయక్, పిదికిటి గోపాల్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు…
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ దండగన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసన
Related Posts
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్…
బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
SAKSHITHA NEWS బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బీఆర్ఎస్ mla లకు బేడీలు వేసాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు నిరసనల్లో…