2కోట్ల 55లక్షల వ్యయంతో దుండిగల్ మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 124వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో వార్డ్ 1, 5, 7, 10, 15, 27, 28, లో దుండిగల్ తండా, సర్వే నెంబర్ పరిధిలోని 214 – గుంటూరు బస్తి, చైతన్యపురి కాలనీ, సరిగూడెం, సర్వే నెంబర్ 120 పరిధిలోని – సాయి పూజ కాలనీ, మల్లికార్జున్ నగర్, డాక్టర్ బస్తి-బి చంద్ర శేఖర్ రెడ్డి నగర్, డి.పోచంపల్లి, బహదురుపల్లి – ఖమ్మ సంగం లో పాదయాత్ర చేస్తూ సీసీ రోడ్డు, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు.
అనంతరం కమ్మ సంఘం వారు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు సుస్థిర పాలన అందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఏ ఒక్కరి ఊహకు ఉందని ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిన ఘనత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక కౌన్సిలర్ లు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సంక్షేమ సంఘాల నాయకులు సభ్యులు, మహిళా నాయకురాలు, కాలనీ బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.