124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ బ్లాక్ నెంబర్ 10 లో అక్తర్ బేగం సయ్యద్ అనే ఆమె ఇద్దరి కుమారులతో నివసిస్తున్నారు. మొన్న శనివారం రోజున ప్రమాదవశాత్తు వారి ఇల్లు దగ్దమై ఇంటిలోని సామాన్లు, ఫర్నిచర్, బట్టలు అన్ని కాలిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారిని పరామర్శించి, నెలరోజులకూ సరిపడిన నిత్యావసర సరుకులు మరియు కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, CH.భాస్కర్, షౌకత్ అలీ మున్నా, ఖాజా, బాలస్వామి, యాదగిరి, అరుణ, సలీమ్, రవీందర్, రాజు, వంశీగౌడ్, అంజద్, అబ్బాస్, చోటు, ఖలీమ్ తదితరులు పాల్గొన్నారు.
124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ బ్లాక్ నెంబర్ 10
Related Posts
అరెస్ట్ లకి భయపడేది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు
SAKSHITHA NEWS అరెస్ట్ లకి భయపడేది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తాండూరు గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలైన ఘటనకి సంభందించి విద్యార్థులని…
34,500/- నగదు అందజేత..
SAKSHITHA NEWS 34,500/- నగదు అందజేత..సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-బుగ్గారం : మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సోషల్ మీడియా ధర్మపురి నియోజకవర్గ కో-కన్వీనర్ పంచిత లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బిజెపి నాయకులు కార్యకర్తలు…