115 వ రోజు ప్రగతి యాత్ర..

Spread the love

నియోజకవర్గ అభివృద్ధికి నిదులకొరత లేదు…

5 కోట్ల 76 లక్షల వ్యయంతో జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 115వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వైష్ణవి ఎనక్లేవ్లో రూ. 64 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, ఎన్.సి.ఎల్ కాలనీలో రూ. 91.00 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, సప్తగిరి ఎనక్లేవ్ లో రూ. 32.00 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, అంగడిపేట్ లో రూ. 58.00 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, జీడిమెట్ల గ్రామం వద్ద రూ. 78.00 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు,రాఘవేంద్ర కాలనీలో రూ. 42.40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎం.ఎన్.రెడ్డి నగర్ ఫేస్ I & II లలో రూ. 34.00 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, ప్రసూన నగర్లో రూ. 37.00 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, భూమారెడ్డి కాలనీలో రూ. 39.00 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, వినాయక్ నగర్ రూ.1.06 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు పాదయాత్ర చేస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు.


ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో జీడిమెట్ల డివిజన్ల పరిధిలోని పలు కానీలలో 5 కోట్ల 76 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం జరిగింది అని, గడిచిన 9 ఏళ్లలో కోట్లాది రూపాయలు వెచ్చించి నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులను చేపట్టామని ప్రజా సౌకర్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు, సౌకర్యవంతమైన రహదారులు, త్రాగునీరు, మెరుగైన విద్యుత్, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులతో ప్రతి డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిదుతున్నామన్నారు.
అనంతరం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా కానీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కుంట సిద్దిరాములు, సంపత్ మాధవ్ రెడ్డి, సుధాకర్ గౌడ్, పి జ్ఞానేశ్వర్, కే నగేష్, సమ్మయ్య నేత, యేసు, నదీమ్ రాయి, మసూద్, అరుణ రెడ్డి, ఇందిరా రెడ్డి, ఆర్.వెంకట్, మేడి బాగయ్య, డాక్టర్ రవీందర్ రెడ్డి, నాని, అనిల్ గౌడ్, వెంకట్ రెడ్డి, పద్మ, గణేష్, ఆనంద్ బాబు, అశోక్, కరుణాకర్ రెడ్డి, ఉమాపతి, శ్రీకాంత్, శంకర్, శ్రీనివాస్, సుబ్బా రావు, గోపాల్ రెడ్డి, శంకర్, బలవంత్ రెడ్డి, నర్సింహా రెడ్డి, గోపాల్ రెడ్డి, పెద్ది మల్లేష్, యాదగిరి, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page