విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన సేవకు గుర్తింపు….
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా మారపల్లి ఈశ్వరమ్మ….
కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా అవార్డు స్వీకరణ….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగిరి/ : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ, విద్యారంగానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మారపల్లి ఈశ్వరమ్మ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.
ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా ఈశ్వరమ్మ అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందిస్తూ, విద్యార్థుల అభ్యున్నతి కోసం ఆమె చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.
ఈశ్వరమ్మను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కవ్వంపల్లి సతీష్, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు లంక సదయ్య, జిల్లా కో-కన్వీనర్ ఆకునూరి బాలంకూస్, జిల్లా నాయకులు బొచ్చు శంకర్, మోరే సారయ్య, బెజ్జాల రమేష్ తదితరులు అభినందించారు.
అలాగే ఈశ్వరమ్మ విజయానికి అండగా నిలిచిన ఆమె భర్త శనిగరపు పోచయ్య, కుటుంబ సభ్యులకు కూడా వారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST