అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో6 బంగారు పతకాలు సాధించినచదువుల భార్గవిని సన్మానించిన ……………….జిల్లా ఎస్పీ*రావుల గిరిధర్
సాక్షిత వనపర్తి
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ని పూర్తి చేసి అందులో ఆరు బంగారు పతకాలు సాధించిన వనపర్తికి చెందిన గుండోజు భార్గవిని జిల్లా ఎస్పీ *రావుల గిరిధర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఆ యూనివర్సిటీ 55వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ,వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్డాస్ జానయ్య,డిల్లీ ICAR డైరెక్టర్ అఫ్ జనరల్ డా.మంగీలాల్ జాట్ ఆమెను ఓవర్ అల్ కేటగిరీలో 4, ఫామ్ మిషనరీ, ఫుడ్ ప్రాసెసింగ్ లో 2 బంగారు పతకాలను అందజేసి సన్మానించారు.
చదువులో చక్కగా రాణించి పలువురికి స్పూర్తిగా నిలిచిన భార్గవిని ఎస్పీ పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
పేద కుటుంబానికి చెందిన ఆమె తండ్రి యాదగిరి ఆచారి స్వర్ణకార వృత్తి చేస్తూ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించడం చదువు పట్ల ఆయనకు గల నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డిసి ఆర్బీ డిఎస్పీ, మహేశ్వరరావు, వనపర్తి సిఐ, కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, యం. తిరుపతయ్య, బి. యాదగిరి, బైరోజు చంద్ర శేఖర్,మాజీ కౌన్సిలర్ బ్రహ్మ చారి, సుగుణ బ్రహ్మయ్య ,ఈశ్వరాచారి శ్రీనివాసులు డా.శ్యాం సుందర్,మాధవాచారి,రమేష్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
