బాలికల గురుకుల పాఠశాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల అభివృద్ధి పనులను చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆయన సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఈ పనులను పరిశీలించారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన, శుభ్రమైన, విద్య, వాతావరణం, కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. మెరుగైన వసతులు కల్పించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు.
