ప్రశ్నించే గొంతుకలపై రేవంత్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల

Sakshitha news

ప్రశ్నించే గొంతుకలపై రేవంత్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ ……..బిఆర్ఎస్ నిరసన
సాక్షిత వనపర్తి

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలపై కక్ష్య సాధింపు చర్యలను నిరసిస్తూ గట్టు యాదవ్ అధ్యక్షతన అంబేద్కర్ చౌరస్తాలో బి.ఆర్.ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండున్న ఏండ్లుగా అరాచక,అవినీతి పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు.
మాజీ I.P.S అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అవినీతి,విధ్వంస పాలనను గొంతెత్తి నిలదీస్తుంటే అవినీతిపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను తీసుకొస్తుందని తట్టుకోలేక ఏ విధమైన ముందస్తు సమాచారం లేకుండా ఉన్నఫళంగా భద్రతను తగ్గించడాన్ని తీవ్రంగా ఖండించారు.
I.P.S అధికారిగా సుదీర్ఘ సేవలు రాష్టానికి అందించి శాంతి భద్రతలు కాపాడడానికి అసాంఘిక శక్తులతో తన ప్రాణాలు సహితం లెక్కచేయకుండా పోరాడిన ఉన్నతస్థాయి అధికారికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదేనా?అని ప్రశ్నించారు.
వ్యక్తిగత కక్ష్యతో ప్రవీణ్ కుమార్ సతీమణి మహాలక్ష్మి ని కూడా ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేయడం నీచమైన చర్య అని ఖండించారు.
ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కి ప్రభుత్వం రక్షణ కల్పించకపోయినా ప్రజలే కాపాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.ఒకవేళ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమారు కి ఎటువంటి ముప్పు వాటిల్లినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో మంత్రుల సతీమణులు ఉన్నత స్థాయిలో ఉన్నా ఏనాడు వారిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదని గుర్తు చేశారు..

అనంతరం జిల్లాఎస్.పి కి వినతిపత్రం సమర్పణ.
మాజీ I.P.S అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కి వెంటనే భద్రత కల్పించాలని కోరుతూ నాయకులు జిల్లా ఎస్.పి డి.సునీతా రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కి గతములో ఉన్న భద్రతను యధావిధిగా కొనసాగించాలి అని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,మాజీ జెడ్.పి.టి.సి పద్మ వెంకటేష్,ధర్మా నాయక్,ప్రధాన కార్యదర్శి గంధం.పరంజ్యోతి,మండల అధ్యక్షులు కె.మాణిక్యం,వనం.రాములు,నాయకులు ఉంగ్లం. తిరుమల్ ,జాతృ నాయక్,దొడ్ల.రాములు విజయ్ కుమార్, కౌన్సిలర్స్ భారతి ప్రేమ్ నాథ్ రెడ్డి,ఏర్వ.అరుణ శ్రీనివాసులు,మాజీ కౌన్సిలర్స్ నాగన్న యాదవ్, స్టార్.రహీమ్, ఇమ్రాన్,వెంకట్ సాగర్, హేమంత్ ముదిరాజ్,జోహెబ్ హుస్సేన్,సూర్యవంశం.గిరి,సయ్యద్.జమీల్, మహేశ్వర్ రెడ్డి.బాలస్వామి,వడ్డే.రమేష్,చిట్యాల.రాము, కవితా నాయక్ మంద.రాము,నందిమల్ల.రమేష్, వడ్డేమాన్.రవి,నాగరాజు,యుగంధర్ రెడ్డి,గంధం. విజయ్, గొర్ల.బాలయ్య, అలీమ్,శిరీవాటి.శంకర్,ఖాదర్శా,ఖాదర్,విజయ్ సాగర్,లోకాజి తదితరులు ఉన్నారు.

Scroll to Top