కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన బండారి లేఔట్ డివిజన్ అధ్యక్షులు వాసు వారగాని .
అనంతరం హన్మంతన్న వారిని శాలువతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ప్రతి డివిజన్ అధ్యక్షుడి ప్రధాన లక్ష్యంగా ఉండాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకొని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజాహిత కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు.
పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, ప్రాధాన్యం లభిస్తుందని పేర్కొంటూ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల విశ్వాసాన్ని చూరగొని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
