హాస్టల్ వార్డెన్ లతో సమావేశం…
సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు…..
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
సాక్షిత పెద్దపల్లి//
సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో హస్టల్ వార్డెన్ లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, సంక్షేమ హాస్టల్స్ వార్డెన్ తప్పనిసరిగా పిల్లలు భోజనం చేసే సమయంలో, సాయంత్రం స్టడీ అవర్స్ లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. హాస్టల్స్ లోనే వార్డెన్ తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
మార్చి నెలాఖరు లోపు హాస్టల్స్ కు కేటాయించిన బడ్జెట్ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగిసే వరకు స్టడీ అవర్స్ జరగాలని కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 23 చివరి తేదీ వరకు మిగిలిన తరగతి పిల్లలకు కూడా స్టడీ అవర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, ఏసీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్, హాస్టల్ వార్డెన్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY