రేపటి రోజున డిజిటల్ దే హవా
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ప్రస్తుతం కొనసాగుతున్న మొబైల్ యుగంలో, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకొని సమాచార రంగంలో ప్రజలకు అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజలకు చేరువైన డిజిటల్ మీడియానే ప్రజలు ఆదరిస్తున్నారని,భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియా దేనని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి తెలిపారు. హుజూర్నగర్ కు చెందిన జర్నలిస్టు చిలక సైదులు ఆధ్వర్యంలో రూపొందించిన మెగా డిజిటల్ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల కార్యాలయంలో అసోసియేషన్ నాయకులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలంతోపాటు సమాచార వ్యవస్థ అందులో కొనసాగుతున్న జర్నలిస్టులు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని సూచించారు. ప్రజల ఆకాంక్షల మేరకు సమాచారం కూడా అందించే విధంగా జర్నలిస్టులు తమ వార్తలను అందించే విధంగా ఉండాలని తెలిపారు. సమాజమంతా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు నడుస్తున్న నేపథ్యంలో టామ్ ఇంకా పాత పద్ధతుల ద్వారానే ప్రజలకు సమాచారాన్ని అందిస్తాము అని ఆలోచన చేస్తున్న వారు కొత్తగా ఆలోచన చేసి ప్రజల అభిమానాన్ని పొందుకోవాలని సూచించారు. మీడియా రంగంలోకి నూతనంగా వస్తున్న వారిని పాతతరం వారు ప్రోత్సహించి ముందుకు నడిపించాలని కోరారు.సందర్భంగా క్యాలెండర్ రూపొందించిన జర్నలిస్టు చిలక సైదులును అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దుర్గం బాలు,సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి తిరుపతి శ్రీనివాస్,సూర్యపేట నియోజకవర్గ అసోసియేషన్ నాయకులు వంశీకృష్ణ శర్మ, కొండ రవి, కుంచం రాంబాబు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
