జిల్లాలో 1655 కిలో లీటర్స్ ఇంధన నిల్వలు సిద్ధం….
ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు…
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి,
జిల్లాలో పెట్రోల్ ( మోటార్స్ స్పిరిట్), డీజిల్ ( అధిక వేగవంతమైన డీజిల్) నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారుల నివేదికల ప్రకారం జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధన సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందన్నారు.
జిల్లాలో మొత్తం 108 పెట్రోల్ బంకులు ఉండగా, రోజువారీ సగటు విక్రయాలు 255 కిలోలీటర్లు నమోదవుతున్నాయని తెలిపారు. ఇందులో పెట్రోల్ 82 KL, డీజిల్ 173 కిలో లీటర్స్ గా ఉన్నాయి. గడిచిన రోజున 240 కిలో లీటర్స్ ఇంధనం విక్రయించబడగా, ఇందులో పెట్రోల్ 78 కిలో లీటర్స్ , డీజిల్ 162 కిలో లీటర్స్ గా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1655 కిలో లీటర్స్ ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇందులో పెట్రోల్ 624 కిలో లీటర్స్, డీజిల్ 1031కిలో లీటర్స్ గా ఉన్నాయని తెలిపారు.
అన్ని ఆయిల్ కంపెనీలు (ఐఓసీఎల్, హెచ్ పి సి ఎల్ , బిపిసిఎల్ ) ద్వారా సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా అవసరమైన మేరకు మాత్రమే ఇంధనం వినియోగించాలని కలెక్టర్ సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY