తిరుపతిలోని వైయస్ఆర్ మార్గ్ డిపిఆర్ కళ్యాణమండపంలో వైస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి పరిచయ సభ సాక్షిత : ఈ పరిచయ సభకు ముఖ్య అతిధిగా శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి విచ్చేసి వైకాపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి పరిచయo చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ మార్చిలో జరగనున్న తూర్పు రాయలసీమ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న శ్యాంప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ 36 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల్లో తిరుపతి నుంచి అత్యధిక మెజారిటీ తీసుకువచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు, అధికారాన్ని నెత్తికెక్కించుకోకుండా, ప్రజా సేవకులుగా పనిచేసి, తూర్పు రాయలసీమ శాసనమండలి ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన భాద్యత పార్టీ శ్రేణులపై ఉందని శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మల్లం రవిచంద్ర రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్కె బాబు, టౌన్ బ్యాంకు చైర్మన్ కేతం జయచంద్ర, గంగమ్మ గుడి చైర్మన్ కట్టా గోపియాదవ్, స్టేట్ విలెజ్ & ఖాదీ కార్పొరేషన్ డైరెక్టర్ దుద్దెలు బాబు, ఇతర సీనియర్ నాయకులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,అనుబంధ విభాగాల నాయకులు, పాల్గొన్నారు..
వైస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి
Related Posts
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి
SAKSHITHA NEWS సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడి.. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న నిర్మాత అల్లు అరవింద్…. SAKSHITHA NEWS
మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూముల
SAKSHITHA NEWS మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూములలోని వివిధ సర్వే నెంబర్ లలో రిజిస్ట్రేషన్ నిలిపివేతపై..బాధితులకు…న్యాయం చేయాలని కోరుతూ…బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందచేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి SAKSHITHA NEWS