బాలల స్వేచ్ఛ, వికాసానికి భంగం కల్గిస్తే కఠిన చర్యలు – యస్.పి కె.అపూర్వ రావు

Spread the love

బాలల స్వేచ్ఛ, వికాసానికి భంగం కల్గిస్తే కఠిన చర్యలు – యస్.పి కె.అపూర్వ రావు

— బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు

— ఇటుక తయారీ పరిశ్రమలో పని చేస్తున్న 20 మంది బాలబాలికలను గుర్తించిన ఏ.హెచ్.టియూ పోలీస్ బృందం.

నల్లగొండ సాక్షిత ప్రతినిధి

బాలల స్వేచ్ఛ, వికాసానికి భంగం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యస్.పి అపూర్వ రావు అన్నారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీస్ బృందం, ఐజే ఎం ఎన్జీఓ,లేబర్, చైల్డ్ కేర్, డిసిపియు,రెవెన్యూ అధికారుల సమన్వయంతో నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంపురం అన్నెపర్తి గ్రామంలో మైనర్ పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న బ్రిక్స్ కంపెనీ యజమాని చిల్ల నర్సింహకు సంబందించిన ఎస్విబి ఇటుకలు తయారీ కంపెనీలో పని చేస్తున్న 20 మంది బాలబాలికలను గుర్తించి నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించడం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా యస్.పి అపూర్వ రావు మాట్లాడుతూ ఎవరైనా బాలల యొక్క స్వేచ్ఛకు, వికాసానికి భంగం కలిగించిన, వెట్టి చాకిరీ చేయించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పరిశ్రమలు, బ్రిక్స్ తయారీ, హోటల్స్, లాడ్జ్, దుకాణాలు ఇలా ఎక్కడైనా బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే సంబంధిత యాజమాన్యాలపై కేసులు నమోదు తప్పదని హెచ్చరించారు. ఎవరైనా బాల బాలికలను పనిలో పెట్టుకున్న చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయించుకున్న చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్1098, వుమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలి అని కోరారు. ఈ బాల కార్మికులను గుర్తించిన వారిలో ఏ.హెచ్.టి యూ టీమ్ ఇంచార్జి యస్.ఐ జె.గోపాల్ రావు , హెచ్.సి నర్సింహ,పి.సిలు నజీర్, సాయి సందీప్,లింగయ్య,అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజు, ఆర్ ఐ రెవెన్యూ, చైల్డ్ కేర్,చైల్డ్ లైన్, సి డబ్లు సి బృందం మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page