SAKSHITHA NEWS

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి – యస్.పి రాజేంద్రప్రసాద్

  • ఆశకు పోయి సైబర్ మోసగాళ్ళు చేతిలో మోసపోవద్దు.
  • వ్యక్తి గత వివరాలు, బ్యాంక్ వివరాలు అపరిచితులకి తెలపొద్దు
  • సైబర్ మోసాలపై టోల్ ఫ్రీ నంబర్ 1930 కి పిర్యాదు చేయండి. – యస్.పి రాజేంద్ర ప్రసాద్

సూర్యాపేట జిల్లా
(సాక్షిత ప్రతినిధి)

సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా పోలీసు కార్యాలయం నందు మీడియా సమావేశం నందు వివరించిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మారుతున్న ప్రజాజీవన విధానం, పెరుగుతున్న వసతులు, అభివృద్ధి చెందిన సాంకేతికత, ప్రతి ఒక్కరి చేతిలో అంతర్జాలం, మొబైల్ వినియోగం వీటన్నిటితో పాటు ప్రస్తుత ఆధునిక సమాజంలో సైబర్ మోసాలు, సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రజలు అవగాహన లోపం వల్ల, దురాశ వల్ల సైబర్ మోసాలకు గురై ఆర్థికంగా నష్టపోతున్నారు. సైబర్ మోసాలకు గురై ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి ఫోన్ చేసి వివరాలు తెలపాలి, నష్టానికి సంభందించిన బదిలీలను హోల్డ్ చేసి రికవరీ చేయవొచ్చు అన్నారు. పెట్టుబడుల తరహా మోసం, ఆధార్ ఉపయోగించి మోసాలు, సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లలో డబ్బులు అడగడం, ఇంటర్నెట్ వీడియో కాల్, కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్లు, లోన్ యాప్ మోసాలు, బ్యాంకు ఖాతా అప్డేట్ చేయడం, లాటరీ, గిఫ్ట్ అంటూ మోసం, ఓ ఎల్ ఎక్స్ విధానమైన మోసాలు, తక్కువ వడ్డీ రుణాలు లాంటివి ఎక్కువగా జరుగుతున్న సైబర్ మోసాలు, ఇలా ఏదో రకంగా అపరిచితులు వినియోగదారులను సంప్రదించి ఆశ చూపి వ్యక్తిగత వివరాలు తెలుసుకుని లక్షల్లో ఆర్థిక నష్టం కలిగిస్తున్నారు.
ప్రజా జీవన విధానానికి అనుగుణంగా పెరుగుతున్న సాంకేతికతను ఆధారంగా చేసుకుని కొంతమంది మోసగాళ్లు ప్రజల అవసరాలను ఆశగా చూపి వారి నుండి డబ్బులు దొంగలించి ఆర్థిక నష్టాలను కలగచేస్తున్నారు. ప్రజలు వినియోగదారులు ఏది ఉచితంగా రాదు ఏదీ తక్కువకు రాదు మనకు ఇతరులు ఎవ్వరు ఏది ఇవ్వరు కష్టం లేనిదే మనము లాభాన్ని ఆశించకూడదు అనే విషయాలను గుర్తుంచుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు నాగభూషణం, వెంకటేశ్వర్ రెడ్డి, సిఐలు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS