రోజులు కాదు… సంవత్సరాలు గడిచినా కేసీఆర్ హామీలు అమలు కావు
- ముదిగొండ మండలంలో పర్యటించిన పొంగులేటి
- మేడేపల్లి గ్రామంలో వరి, మామిడి, మొక్కజొన్న పంటల పరిశీలన
- అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్
- మాదాపురం, యడవల్లి గ్రామాల్లోని పలు బాధిత కుటుంబాలకు పరామర్శ
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న గ్రామదీపికలకు సంఘీభావం
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
రోజులు… వారాలు… నెలలు కాదు… సంవత్సరాలు గడిచినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కావని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎద్దేవా చేశారు. ముదిగొండ మండల పర్యటనలో భాగంగా మేడేపల్లి గ్రామంలోని వరి, మామిడి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోనకల్ మండలంలో సీఎం కేసీఆర్ పర్యటించినప్పుడు గంటల వ్యవధిలో రైతులకు ఇస్తానన్న నష్టపరిహారం 45 రోజులు గడిచినా నేటికీ అందలేదన్నారు. సంవత్సరాలు గడిచినా ఆయన హామీలు అమలు కావని కేసీఆర్ ను విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో రైతుల ఉసురు తప్పకుండా సీఎంకు, ఆయన ప్రభుత్వానికి తగులుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్లను పరిష్కారించాలని గత పదిరోజులుగా గ్రామదీపికలు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. మాదాపురం, యడవల్లి గ్రామాల్లోనూ పొంగులేటి పర్యటించి బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డాక్టర్ కోటా రాంబాబు, దేవరపల్లి అనంతరెడ్డి, బత్తుల వెంకట్రావు, చావగాని వెంకన్న ప్రసాద్, జూలకంటి సంజీవరెడ్డి, వట్టికూటి సైదులు గౌడ్, కందుల రంగారావు, వాకా వెంకటేశ్వర రెడ్డి, ఏలూరి హనుమంతరావు, జూలకంటి వెంకట రెడ్డి, మోర్తాల నాగార్జున రెడ్డి, దేవరపల్లి రాఘవ రెడ్డి, మీగడ శ్రీనివాస యాదవ్, వాకదాని కన్నయ్య, లింగా రెడ్డి, సోమా అంకిరెడ్డి, కొండా రామారావు, సతీష్, నెల్లూరి భద్రయ్య, పొంగులేటి యూత్ నాయకులు, పొంగులేటి జన సైనికులు అధిక సంఖ్యలో ఉన్నారు.