జంతర్ మంతర్ లో పరీక్ష పత్రాల లీక్ లను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ధర్నా.
ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ రెడ్డి, జైవీర్ రెడ్డి,మరియు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణా.
పేపర్ లీక్ లపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలి.
బీజేపీ ప్రభుత్వం లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది.
నెట్ పరీక్ష రద్దు చేసిన కేంద్రప్రభుత్వం, నీట్ పరీక్షను ఎందుకు రద్దు చెయ్యట్లేదో చెప్పాలి.
పరీక్షల నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది.
పేపర్ లీక్ లు 20 బీజేపీ ఎంపీల కుటుంబ సభ్యుల కోసం చేశారు.
వారి పేర్లు బయటకురాకుండా చేసేందుకే నీట్ రద్దు చేయడం లేదు.
విద్యార్థులకు న్యాయం చేసేంతవరకు పోరాటం చేస్తాం.
పార్లమెంట్ లో నీట్ ఇష్యూ ను లేవనెత్తుతాం.
పేపర్ లీక్ ల వెనుక ఎవరు ఉన్న కఠినంగా శిక్షించాలి- కాంగ్రెస్ ఎంపీలు.