SAKSHITHA NEWS

youth caught transporting ganja Ashwaravpeta

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా//

స్లగ్: గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ అశ్వారావుపేట యువకులు

వాయిస్ ఓవర్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గంజాయి వాడకం రోజురోజుకీ పెరిగిపోతుందని, సోమవారం జరిగిన సంఘటనతో మరోసారి రుజువు అయింది. ఇప్పటికే పలు కేసులు నమోదు అవుతున్నప్పటికీ స్మగ్లర్లలో మార్పు రావడం లేదు. అశ్వారావుపేట కేంద్రంగా చేసుకొని యువతను బానిసలుగా చేస్తున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు.

వాయిస్ ఓవర్:

అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బొమ్మెర బాలకృష్ణ, తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తన సిబ్బందితో ఖమ్మం రోడ్డు లోని ఫైర్ కాలనీ, వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకోవటానికి ప్రయత్నించగా గమనించిన ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి, వారిని వెంబడించి పమిడి మణికంఠ, గాదల రాకేష్ బాబు, చెన్ను అనిల్ కుమార్ అనే వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 1.5 కేజీల గంజాయి, 20,000 రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ఇదే గంజాయి ముఠాకి చెందిన తుపాకుల నరసింహ, పమిడి వెంకటేష్, నాగరాజు, ఏసురాజు అనే నలుగురు యువకులు పరారీలో ఉన్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ బొమ్మెర బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ, యువకులు గంజాయికి బానిస అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యత తీసుకోవాలని అనుమానాస్పదంగా ఉన్న ప్రదేశాలను, వ్యక్తులను గుర్తిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బొమ్మెర బాలకృష్ణ, ఎస్ఐ బి రాజేష్ కుమార్, అదనపు ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS