డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసిపి సోషల్ మీడియా వేలకోట్లు

డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసిపి సోషల్ మీడియా వేలకోట్లు

SAKSHITHA NEWS

చిక్కుల్లో సజ్జల”

డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసిపి సోషల్ మీడియా వేలకోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది

వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న వారికి డిజిటల్ కార్పొరేషన్ పేరుతో అవుట్సోర్సింగ్ పేరిట వేలకోట్ల చెల్లింపులు చేశారు. వీరంతా వైసిపి కోసం పనిచేశారు.

పైకి మాత్రం కార్పొరేషన్. చేసిందంతా మాత్రం దోపిడీనే. ప్రజల సొమ్ముతో సోషల్ మీడియాలో వైసిపి ప్రచారం చేసిందని తేలింది.

విశేషమేమిటంటే.. జడ్జిలపై తప్పుడు వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన వారికి కూడా లక్షల్లో జీతాలు చెల్లించినట్లు బయటపడింది.

ఇటీవల టిడిపి నేతలు దాడి చేశారని ఆరోపణలు చేసిన పాలేటి రాజ్ కుమార్, ఆయన భార్యకు కూడా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వైసిపి సోషల్ మీడియాను హ్యాండిల్ చేసింది సజ్జల భార్గవ్ రెడ్డి. అందులో పని చేస్తున్న వారికి డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఏపీ ప్రభుత్వం జీతాలు చెల్లించారు..

అందుకే ఈ కేసు ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి మెడకు చుట్టుకుంది. అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

అయితే ఆయన ఎక్కడ ఉన్నా విడిచి పెట్టే ఛాన్స్ లేదు. తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటే భార్గవ రెడ్డి పై సైతం ఉక్కు పాదం మోపి అవకాశం ఉంది.

వీరిపై మున్ముందు కేసులు పెరిగే అవకాశం ఉందని.. అన్నింటికీ ఈ తండ్రీ కొడుకులే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.

డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసిపి సోషల్ మీడియా వేలకోట్లు

SAKSHITHA NEWS