తెలుగుదేశం పార్టీ సంబరాలతో దద్దరిల్లిన యర్రగొండపాలెం..

Spread the love

తెలుగుదేశం పార్టీ సంబరాలతో దద్దరిల్లిన యర్రగొండపాలెం…


సాక్షిత : యర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గెలిచిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ముందుగా యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పటాసులు కాల్చి టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కేక్ కటింగ్ చేశారు. అనంతరం టిడిపి కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు.

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్దేశించి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page